పాట్నా: కొడుకు కావాలన్న కోరికతో ఓ వ్యక్తి ఏ తండ్రి చేయని పని చేశాడు. సభ్య సమాజం తల వంచుకునేలా చేశాడు. తాంత్రికుడు చెప్పిన మాట్లాలు విని తన కుమార్తెలపైనే గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ కేసులో ఆ నీచ తండ్రికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది.
Also Read: Dubai Lottery ticket: డామిట్ కథ అడ్డంతిరిగింది.. లక్ వచ్చి తలుపు కొట్టినా తీయడేంటి..
వివరాల్లోకి వెళ్తే పాట్నాలోని బక్సర్ కు చెందిన ఓ దంపతులు చాలా కాలం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొడుకు పుట్టాలంటే ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్లాలని అతడి గురించి చెప్పాడు వారి బంధువు ఒకరు. దీంతో అజయ్ కుమార్ అనే తాంత్రికుడు వద్దకు వెళ్లాడు ఆ వ్యక్తి. తన ఇద్దరు కూతుర్ల వల్లే తనకు కొడుకు పుట్టడం లేదని ఆ తాంత్రికుడు తెలిపాడు. కొడుకు పుట్టాలంటే కూతుళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి ఆ తండ్రి కూతుళ్లను బలవంతంగా రేప్ చేయడం మొదలు పెట్టాడు. దానికి వారి తల్లి, తల్లి సోదరి కూడా సహకరించారు.
కేవలం తండ్రి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తాంత్రికుడు కూడా వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. వారిపై 2012 నుంచి ఆత్యాచారం చేయడం మొదలు పెట్టారు. ఇక తండ్రి వేధింపులు భరించలేకపోయిన ఆ ఇద్దరు ఆడపిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసు పెట్టే సమయానికి బాధితుల వయసు 14, 16 ఏళ్లు. ఇలాంటి చర్యలు ద్వార సమాజం తలదించుకోవాల్సి వస్తుందని భావించిన కోర్టు నిందితులకు కఠిన శిక్షను విధించింది. తండ్రికి, తాంత్రికుడు అజయ్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది. ఇక వారి తల్లి, ఆమె సోదరికి 20 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించారు. ఐపీసీ సెక్షన్ 376, 34, పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద నిందితులను దోషులుగా కోర్టు ప్రకటించింది కోర్టు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే వారికి యాదృచ్ఛికంగా వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.