Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
- అయ్యప్ప మాలలో ఉండి కూడా పొలిటికల్ హీట్ పెంచుతున్న ఎమ్మెల్యే..
- సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..
- యుద్ధం తప్పదంటూ ఘాటు హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకలా మాట్లాడుతున్నారు? అధికార పార్టీ శాసనసభ్యుడు అయిఉండి, సొంత ప్రభుత్వం మీదే రివర్స్ ఏవడానికి రీజనేంటి? మొండోడు రాజుకంటే బలవంతుడు అంటూ ఎమ్మెల్యే సన్నిహితులు చేస్తున్న కామెంట్స్ వెనక ప్లానేంటి? నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్న పరిస్థితుల పర్యవసానాలు ఏంటి? లెట్స్ వాచ్.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. శబరిమల యాత్రకు వెళ్ళివచ్చే వరకు ఆయన రాజకీయాలకు అతీతంగా దీక్షలోనే ఉంటారని అంతా అనుకున్నారు. కానీ… దేని లెక్క దానిదే అన్నట్టుగా మాలలోనే స్వరం సవరించుకున్నారాయన. అదీకూడా ధిక్కార స్వరం వినిపించడం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని మునుగోడు కేంద్రంగా విమర్శలు చేశారాయన. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా… మునుగోడుకు అన్యాయం చేసినా… ప్రజల సొమ్ము దోచుకున్నా యుద్ధం తప్పదంటూ ఘాటుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు సొంత పార్టీ ఎమ్మెల్యే.
Also Read
ఆ విమర్శలు చేస్తూనే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బుల్లెట్ దిగడం మిస్సైందని, చరిత్ర సృష్టించాల్సిన మునుగోడు ప్రజలు కొద్దిగా తప్పు చేశారని కూడా కామెంట్ చేశారాయన. దేశ చరిత్రలో మునుగోడు ఉప ఎన్నికలాంటి ఉప ఎన్నిక జరగలేదని, నాడు తనను ఓడించడానికి రాష్ట్ర ప్రభుత్వమే మునుగోడుకు వచ్చిందని అన్నారు. ప్రస్తుత పాలకులు మరోసారి తప్పు చేస్తే అటువంటి నిర్ణయానికి మళ్ళీ వెనుకాడబోనంటూ హై పిచ్‌లోనే చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అయితే… ఆయన అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుండటం చర్చనీయాంశమైంది. 2018లో మునుగోడు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై పదునైన విమర్శలు చేశారు.
అంతేకాదు, ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమై తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి బైపోల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటమి తప్పలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని వదలి తిరిగి హస్తం గూటికి చేరారాయన. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు ఎమ్మెల్యే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు.. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో తాను ప్రచారం చేయడం వల్లే అక్కడ కాంగ్రెస్ గెలిచిందని… తాను బీజేపీని వదిలి కాంగ్రెస్ కు రావడం వల్ల కాంగ్రెస్ పెద్ద మైలేజ్ పెరిగిందన్నది ఆయన లెక్క. తన వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయతీరాలకు చేరిందని గట్టిగా నమ్ముతున్నారట రాజగోపాల్ రెడ్డి. మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రమే కాదు… పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీయం రేవంత్ రెడ్డి కూడా తనను మంత్రిని చేస్తానని బహిరంగ సభలో చెప్పారంటూ గుర్తు చేస్తున్నారు రాజగోపాల్. పార్టీకి నేను ఇచ్చిన హామీ నెరవేర్చాను. నాకు అధిష్టానం, సీయం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలి కదా అన్నది ఆయన క్వశ్చన్.
ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండో సారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని.. తనకు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ చాలా నియోజకవర్గాలపై గట్టి పట్టు ఉందని.. గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే సత్తా ఉందని అంటున్నారట. మంత్రి పదవి విషయంలో తనకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా…. నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులు కూడా విడుదల చేయడం లేదని అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే… నిబంధనల ప్రకారం తమ కంపెనీకి రావాల్సిన కాంట్రాక్టులు మరెవరికో దక్కేలా ప్రభుత్వ పెద్దలు తెరవెనక మంత్రాంగం నడిపించారంటూ మండిపడుతున్నారట.
ఇవన్నీ చూస్తుంటే…. పుండు మీద కారం చల్లినట్టుందని, పొమ్మనలేక పొగబెట్టినట్టు కనిపిస్తోందని సన్నిహితులతో అంటున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో… సొంత పార్టీ ముఖ్యనేతల తీరుపై చాలాకాలంగా అసంత్రప్తిగానే ఉన్నారట ఆచయన. అందుకే ధిక్కార స్వరం రోజురోజుకు పెరుగుతోందంటున్నారు పరిశీలకులు. మొండివాడు రాజు కన్నా బలవంతుడన్న సామెతను గుర్తు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు. కొద్ది రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేశారు. తాజాగా నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానంటూ పొలిటికల్ హీట్ పెంచారు. మొత్తం మీద మునుగోడు ఎమ్మెల్యే ధిక్కారస్వరం, ఆయనకు సొంత పార్టీనేతల కౌంటర్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లా హస్తం పార్టీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఉత్కఠ పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!