Men Thrash Father: పిల్లాడు ఏడుస్తున్నా కనికరించ లేదు.. కర్రలతో దారుణంగా కొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Men Thrash Father: తన కొడుకును స్కూల్‌లో దింపడానికి వెళ్లిన తండ్రి దుండుగులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. చిన్న పిల్లాడు దీనిని చూసి గుక్కపెట్టి ఏడుస్తున్నా.. వాళ్లల్లో కనికరం లేకుండా పిల్లాడి తండ్రిపై దుండుగులు దాడి చేశారు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సాలో జరిగింది. పంజాబ్‌లోని మాన్సాలోని కిడ్ స్కూల్ వైపు ద్విచక్ర వాహనంపై తండ్రీ కొడుకులు వెళుతుండగా, పట్టపగలు కొందరు దుండగులు పిల్లాడి తండ్రిపై దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. కొంతమంది అప్పటికే సంఘటన స్థలంలో వేచి ఉండగా.. మరికొందరు వ్యక్తి బైక్‌ను అనుసరిస్తూ వచ్చారు. ఈ సంఘటనను సీసీటీవీలో రికార్డు అయింది.
Read also: Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ఉదయం బాధితుడు తన పిల్లాడ్ని స్కూల్ వద్ద దింపడానికి బైక్‌పై వచ్చాడు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడ దించి లోపలికి పంపుతున్న దృశ్యాలు విజువల్స్‌లో కనిపించడంతో ఈ సంఘటన విద్యాసంస్థ ముందు జరిగినట్టు తెలుస్తోంది. తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని తన కుమారుడిని దింపడానికి తన వాహనాన్ని ఆపాడు. పాఠశాల వద్ద తన వాహనాన్ని అలా ఆపాడో లేదో.. అప్పటికే వెంబడించిన కొంతమంది యువకులు అతనిపై కర్రలతో దాడి చేశారు. బాధితుడు తిరుగుబాటు చేయకుండా అతన్ని ఓ వ్యక్తి గట్టిగా పట్టకున్నాడు. దీంతో ఇతరులు అతనిపై దాడి చేశారు. పక్కనే ఉన్న బాధితుని కొడుకు నిందితులు పాశవికంగా కొట్టారు. నిందితులు దాడి చేస్తున్నా పక్కనే ఉన్న అందరూ చూస్తున్నారు తప్పా.. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. నిందితులు వెళ్లిపోయాక ఓ మహిళ.. బాధితున్ని లేపి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Visuals from Mansa where due to personal rivalry, six people broke both legs of a person who had come to drop his son off at school. They had a previous dispute as well, and earlier also an FIR under section 307 has been registered against them. pic.twitter.com/JEohspw5P8
— Gagandeep Singh (@Gagan4344) August 10, 2023
- Tags
- father
- Men Thrash
- School
- son
- With Sticks
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!