IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇరుముడి. ఫ్యామిలి ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో వస్తుందేమోనని అభిమానులు భావించారు. అయితే ఈ కథాంశంపై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇస్తూ ‘ఇరుముడి’ అనేది శబరిమల యాత్రకు లేదా అయ్యప్ప స్వామి దర్శనానం, ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన భక్తి చిత్రం కాదని, కథలో అంతకు మించిన ఒక బలమైన డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతుందట. అయ్యప్ప మాల ధారణలో 41 రోజుల అయ్యప్ప దీక్ష అనేది ఒక ముఖ్యమైన భాగం. ఆ దీక్షకు ముందు హీరో జీవితంలో ఏం జరిగింది? దీక్ష సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే అంశాలే కథ ముఖ్యభాగం. అప్పుడు జరిగే సంఘటనలు అత్యంత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయి.
ఈ సినిమా బేసికల్‌గా ఒక భావోద్వేగపూరితమైన ఫ్యామిలీ డ్రామాగా ప్రారంభమవుతుంది. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు అస్సలు ఊహించని ఒక కొత్త స్పేస్‌లోకి కథనం సాగుతుంది. నెమ్మదిగా మొదలై, సీట్ అంచున కూర్చోబెట్టే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా మారి ఆడియన్స్‌కు మైండ్ బెండింగ్ ఫీల్‌ను అందిస్తుంది. కథలో తర్వాత ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ఆద్యంతం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. పూర్తి సీరియస్‌నెస్‌తో సాగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కథలో లీనం చేస్తాయి. అయితే ఈ ఉత్కంఠభరితమైన మిస్టరీ ప్రయాణం చివరకు ఎంతో అందమైన, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో ముగుస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు డీప్ ఎమోషన్స్ ఉన్న సినిమాలు కోరుకునే వారికి ‘ఇరుముడి’ ఒక ఫీస్ట్ లా అనిపిస్తుందని’ అన్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?