AP Crime: కూతురు కాపురం పచ్చగా ఉండాలని కోరుకుంటుంది ఏ అత్త అయినా.. అయితే తన కూతురిని తన వద్దకు రానివ్వడం లేదని అల్లుడిపై పగ పెంచుకుంది ఓ అత్త.. అంతేకాదు అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని స్కెచ్ వేసింది.. దీని కోసం కొంత మందితో కలిసి ప్లాన్ చేసింది.. అల్లుడిని అడ్డు తొలగించుకుంటే.. కూతురు తన వద్దకు వస్తుందని భావించింది.. అయితే, కిడ్నాపర్లతో కలిసి అత్త చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది… చివరకు అత్తతోపాటు…
కువైట్ నుంచి వచ్చాడు అల్లుడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి.. తన కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని వేట కొడవలితో విచక్షణ రహితంగా హత్య చేశాడు మహబూబ్ భాషా అనే వ్యక్తి... కడప నగరంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న చాంద్ బాషా అనే వ్యక్తిని ఓ విందు కార్యక్రమంలో ఉండగా అక్కడి నుండి కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసిన మామమహబూబ్ బాషా.. తన ఇంట్లో, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వేట కొడవలితో అతి దారుణంగా…
ఓ అల్లుడు అత్తింటికే కన్నం వేశాడు. అత్త ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. ఆమె ఇంట్లో లేని సమయం చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. అందినకాడికి దోచుకెళ్లాడు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రోటరీ నగర్ కు చెందిన సంతోష్ వాళ్ల అత్త ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అల్లుడు సంతోష్ చోరీకి పాల్పడ్డాడు. Also Read:CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు,…
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సంక్రాంతి అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలు స్పెషల్ అనుకుంటే అంతకంటే సూపర్ అంటున్నారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా..! అనిపించారు.
విశాఖపట్నంలోని పెందుర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తిలోని చిన్న ముసలివాడ గణేష్ నగర్ ప్రాంతంలో ఆవేశంలో అత్తను అల్లుడుచంపేశాడు. మృతురాలి పేరు దొగ్గ లక్ష్మీ వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. హంతకుడు కే. సన్యాసి నాయుడిగా పోలీసులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన అల్లుని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మామ కూడా అనంత లోకాలకు వెళ్లాడు. తాండూర్ లోని బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోయిన్ అహ్మద్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. అతని మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయి మున్నాభాయ్ ను.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.