UP : కొత్తగా పెళ్లయింది.. పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి వారు చేసి మర్యాదలు కూడా మాములుగా ఉండవు.
అల్లుడా మజాకా... అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు చేసి వడ్డించి అత్తింటి వారి మర్యాదలు ఎలా ఉంటాయో రుచి చూపించారు.
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆయన వయస్సు 36 సంవత్సరాలు.. అయితే, దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. Read Also: Monkeypox Test…
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ లో తండ్రి కూతురు దారుణ హత్యకు గురైయ్యారు. ఇంటి అల్లుడే తండ్రి-కూతురు గొంతు కోశాడు. మృతులు తండ్రి ఓదెలు, కూతురు లావణ్యగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు.