ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన..…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ సాగుతూనే ఉంది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇక, ఇప్పటికే రాజధానిపై తన వైఖరిని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ.. అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చేసింది.. మరోసారి ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలుచేశారు.. సీఎం వైఎస్…
భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయి.. జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని.. ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా…
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే వచ్చిందని.. పార్టీలో వ్యవహారాలన్నీ ఆయన ఒక్కడే అన్ని చూసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన…
జనసేనపై కుట్ర చేస్తున్నారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవవన్ కల్యాణ్‌ను నోవాటెల్ హోటల్‌లో కలిసిన ఆయన.. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు ఆ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు ఇద్దరు నేతలు.. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో…
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం అంటున్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జేఏసీ ఇచ్చిన విశాఖ ఘర్జన పిలుపునకు మద్దతు ప్రకటించింది.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంతో సాగర తీరంలో గర్జన నిర్వహించారు.. అయితే, విశాఖ గర్జనపై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు.. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం అయ్యింది.. సోము వీర్రాజు అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి.. పార్టీ నేతలు శివప్రకాష్, దగ్గుబాటి పురంధేశ్వరి, సునీల్…
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్‌కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం…