అమరావతిలోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పని చేస్తున్న పార్టీ బీజేపీ. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్ధికంగా ప్రపంచంలో ఐదో స్థానానికి తీసుకెళ్ళిన ఘనత మోడీది. నిమ్నవర్గాలను వర్గీకరణ చేయాలన్న డిమాండ్ ఉన్నా.. వైసీపీ పట్టించుకోవడం లేదు. వైసీపీ, టీడీపీలు బీసీలకు తమలపాకులిచ్చి.. అగ్ర కులాలకు తాంబూలాలిచ్చాయి.
Read Also: Viral Video: బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న ఏనుగు.. స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్లు
ఏపీలో బీసీ, ఎస్సీలకు పదవులిచ్చారు కానీ.. వారికి పవర్ ఇవ్వలేదు. వైసీపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుపుతుంది. రాజధాని కట్టకుండా నాటకాలాడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వని కేసీఆరుపై మాట్లాడే దమ్ము వైసీపీకి లేదన్నారు. నడిరోడ్డుపై రైతులు రాజధాని కోసం నడుస్తుంటే రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నాయకులకు వ్యక్తిత్వం లేదు. సీఎం ఇచ్చిన స్క్రిప్ట్ మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారు. బాధ్యతగా ఏపీ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు సోము వీర్రాజు.
Read Also: surrogacy celebrities: సరోగసిలో తల్లిదండ్రులైన సెలబ్రెటీలు