Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి…
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరా గిరి జల వికాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు , సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతకుముందు, సీఎం రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి…
Solar Energy Pros and Cons: ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ లాంటి సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే వీటి నిల్వలు ఆయిపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యామ్నయ వనరులపై దృష్టి సారించాయి. అందులో భాగంగానే డిజీల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఒక్కో యూనిట్ ధర గణనీయంగా పెరగవచ్చు కూడా. ఇది…
Solar Plant: దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం సోలార్ ఎనర్జీ సంస్థ స్వాన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుని భూమిని సమకూర్చింది. ఈ డీల్ తర్వాత కంపెనీ షేర్లకు రెక్కలు వచ్చాయి.
కేంద్ర గ్రీన్ ఎనర్జీ వైపు దృష్టి సారిస్తోంది. దీని కోసం దశల వారీగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించే ప్లాన్ లో ఉంది. నాలుగేళ్లలో కనీసం 81 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని లక్ష్యం పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు యూటీలకు లేఖ రాసింది. థర్మల్ విద్యుత్ స్థానంలో సోలార్, విండ్ పవర్ ను ప్రోత్సహించనుంది. దీని ద్వారా బొగ్గు దిగుమతిని నిలిపివేయడంతో పాటు…
స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్.…
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్…
రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత పరిశ్రమల కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. చమురుతో నడిచే వాహనాలు, విమానాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు సోలార్ వినియోగాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. అయితే, సరైన అవగాహన కల్పించకుంటే ఎంత పెద్ద టెక్నాలజీ అయినా పెద్దగా వినియోగంలోకి రాదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక పనుల కోసం బొగ్గును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బట్టల ఇస్త్రీ కోసం బొగ్గుతో నడిచే ఇస్త్రీ…