కేరళలో జరిగిన ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో చిక్కుకున్న ఓ పెద్ద టయోటా ఫార్చ్యూనర్ కారును భారీ ఏనుగు సెకన్లలో బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో దొంగ దొరికాడురా అంటూ సోషల్ మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. అతడు చేసిన పోస్టును ట్రోలింగ్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని సూచించారు.
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆడ బిడ్డపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. కొన్ని నెలల జైలు అనంతరం నిందితులు బెయిల్ విడుదలయ్యారు.
భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్, బ్రిటిష్- కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ యొక్క ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI)ని భారత ప్రభుత్వం రద్దు చేసింది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 సోకినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా, తన కోవిడ్-19 రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేస్తూ, సురక్షితంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. Also Read:Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు…
Viral News : ఇప్పటి కాలంలో మనుషుల్లో మానవత్వం క్రమంగా తగ్గిపోతున్నదనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయకపోవడం, మృగాల కన్నా హీనంగా ప్రవర్తించడమూ సహజంగా మారిపోయిన సమాజంలో… కొందరు చిన్నారులు చూపించిన ఉదాత్త భావన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో, ఇద్దరు చిన్నారులు గాయపడిన ఓ మూగజీవిపై చూపించిన ప్రేమకు అందరూ ముగ్దులవుతున్నారు. చక్రాల బండిలో గాయపడిన కుక్కను కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ అమూల్యమైన…
Telegram Global Contest: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తూ టెలిగ్రామ్ తమ మొదటి అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. ఈ కాంటెస్ట్‌లో విజేతలకు మొత్తం 50,000 డాలర్స్ (భారత రూపాయల్లో సుమారుగా రూ. 42.8 లక్షలు) బహుమతులు అందించనున్నారు. ఈ పోటీ ద్వారా టెలిగ్రామ్ తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్…
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ..
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం…