హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సెగ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తాకింది.. దానికి ప్రధాన కారణం.. హుజూరాబాద్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్‌లో ఆయన సవాల్ చేయడమే.. అయితే, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఓట్లు రావాలి.. ఈటల గెలవాలి.. అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు గువ్వల.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం వెలువడం.. ఈటల తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. సవాల్ చేసిన గువ్వలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది..
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ఘన విజయం సాధించడంతో గువ్వల మాట మీద నిలబడాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.. గువ్వల బాలరాజు… ఎక్కడంటూ వాట్సాప్, ఫేస్బుక్ లో సెటైర్లు కొనసాగుతుండగా, కొందరు ఆయనకే నేరుగా ఫోన్ చేసి.. మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారు అంటూ అడిగేస్తున్నారట.. మరోవైపు.. ఫోన్లు, ట్రోలింగ్ఎక్కువ కావడంతో గువ్వల ఫోన్స్విచ్చాఫ్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు.. గువ్వలకు ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ అడిగిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక, గువ్వల రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు గువ్వల బాలరాజు.