సమంత-చైతూ విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతను ఏదో రకంగా విమర్శిస్తున్నారు చైతూ అభిమానులు. దీంతో సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైతూతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ట్విట్టర్, ఇన్‌స్టాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పోస్టు పెట్టినా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమంత తీవ్ర మనోవేదనకు గురైంది.
ఇక నుంచి ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే సామ్ క్లారీటీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే తనపై అసభ్యకరమైన రీతిలో యూట్యూట్‌లో పోస్టులు పెట్టిన వారిపై సమంత కేసులు పెట్టింది. దానిపై కోర్టు సైతం స్పందించి సంబంధిత యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు తొలగించాలని ఆదేశించిన సంగతి తెల్సిందే..