MLA Raghunandan Rao: తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చారించారు. ఇవాళ మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ హైదరాబాద్‌కి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపినట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
Read also: Gujarat: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఫైన్ లేదు.. గుజరాత్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
ఇక, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద చేసే కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో ధర్మం వైపు నిలబడాలని సూచించారు…కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వస్తున్నారన్నారు. అయితే.. మునుగోడు ఎన్నిక తరువాత బీజేపీలోకి వస్తారన్నారు. ఇక రఘనందన్ రావుపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు రఘునందన్ రావు పేర్కొన్నారు.
Jagadish Reddy: కోమటి రెడ్డి కుటుంబాన్ని బీజేపీ కొనుక్కుంది