కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి బీజేపీ అమేథీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఏ ఛానెల్ లో ఐనా, హోస్ట్ ఎవరైనా, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్‌లో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల పాకిస్థాన్ కు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ పేర్కొన్నారు. ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు.
Kishori Lal Sharma: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీకి అభ్యర్థుల్ని ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అమేథీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ కుటుంబం ఇక్కడ నుంచి తిరిగి లేని విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా నేత సరస్వతి సర్కార్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలే దాడి చేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకురాలి తలకు గాయమై రక్తస్రావం అవుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారు.. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమేథిలో సీటును బుక్ చేసుకునేందుకు కర్చీఫ్ వేస్తారేమోనంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు.