Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి బీజేపీ అమేథీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఏ ఛానెల్ లో ఐనా, హోస్ట్ ఎవరైనా, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్‌లో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు స్మృతి ఇరానీ ఛాలెంజ్ చేసింది. ఒకవైపు.. సోదరుడు, సోదరీతో పాటు మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారని చెప్పుకొచ్చింది. మా పార్టీ నుంచి అయితే, సుధాంశు త్రివేది చాలు.. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారని ఆమె పేర్కొన్నారు.
Read Also: Crime: మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వాటర్ ప్యూరిఫైయర్ టెక్నీషియన్
ఇక, దేశంలోని ముఖ్యమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలపై స్మృతి ఇరానీ బుధవారం సవాల్ చేసింది. కాగా, 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై 55 వేల మేజార్టీతో విజయం సాధించింది. ఈసారి కూడా బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ నుంచి టికెట్ కేటాయించింది. అయితే, స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌కు కంచుకోటైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్‌ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే, అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ఎన్నికల ప్రచారం చేస్తుంది.