తెలంగాణ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.
సీనియర్ ఐఏఎస్ అయిన స్మితాసభర్వాల్ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్‌తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అంటున్నారు. పర్యాటక శాఖలో ఫైల్స్ అన్నీ పెండింగులోనే పెట్టారని... సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు సైతం రెగ్యులర్‌గా రావడంలేని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపింది.
Smita Sabharwal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్‌కి రాష్ట్ర పోలీసుల నుంచి నోటీసు అందింది. దీనికి కారణం స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమాల్లో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన చిత్రం షేర్ చేయడమే. ఈ చిత్రం మార్చి 31న ‘Hi Hyderabad’ అనే X సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్…
Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు.
మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లో చొరపడేందుకు ప్రయత్నించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి సస్పెండ్ వేటు పడింది. ఆనంద్ కుమార్ రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్, సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అపరిచిత వ్యక్తి తన ఇంట్లోకి చొరబడినప్పుడు తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టానని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అన్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి నివాసానికి వెళ్లారు.
సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా సభర్వాల్ ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది. రాష్ట్ర దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆమె నిన్న బుధవారం వివిధ రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే ఇండియా మ్యాప్ ను పోస్టు చేశారు.
వేసవి తాపం అప్పుడే మొదలైంది. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వేసవికాలంలో ఎదుర్కొనే నీటి ఎద్దడిని తప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అనుకున్న దాటి కంటే వేడి తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలెవ్వరూ నీటికి ఇబ్బంది పడకుండ ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ వేసవిలో తాగునీటి సరాఫరాపై ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో…