వేసవి తాపం అప్పుడే మొదలైంది. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వేసవికాలంలో ఎదుర్కొనే నీటి ఎద్దడిని తప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అనుకున్న దాటి కంటే వేడి తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలెవ్వరూ నీటికి ఇబ్బంది పడకుండ ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ వేసవిలో తాగునీటి సరాఫరాపై ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె వేసవిలో ఎక్కడా తాగునీటి సరాఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడొద్దని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు తాగునీటి కష్టం రావొద్దన్న ప్రభుత్వ సంకల్పాన్ని చిత్తశుద్దితో కొనసాగించాలని ఆమె అధికారులకు గుర్తు చేశారు.