IAS Smita Sabharwal: అపరిచిత వ్యక్తి తన ఇంట్లోకి చొరబడినప్పుడు తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టానని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి నివాసానికి వెళ్లారు. అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈఘటన జరిగి రెండు రోజులు తరువాత వెలుగులోకి ఆరవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ఒక మహిళా ఐఏఎస్ ఇంటిలోకి ఎలా వెళ్లాడు? సెక్యూరిటీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిసాయి. అయితే దీనిపై స్పందించారు స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారని తెలిపారు.
Read also: Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..
ఆ రాత్రి తనకు భయంకరమైన అనుభవం ఎదురైందని చెప్పాడు. తనను తాను రక్షించుకోవడంపైనే తనదృష్టి సారించినట్లు ఆమె ట్వీట్ వేదికగా చెప్పారు. గట్టిగా కేకలు వేయడంతో.. సిబ్బంది వచ్చారని అలా తనను తను రక్షించుకోగలిగానని తెలిపారు. ఏ సమయంలో నైనా సరే ధైర్యం కోల్పోకూడదంటూ ధైర్యంగా ఉండలని సూచించారు స్మితా. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నామని ఆలోచించిన ప్రమాదం ఏ సమయంలో వస్తుందో తెలియదు కావును మీరు ఉంటున్న ఇంటికి ఎల్లప్పుడూ తాలుపులు వేసుకుని ఇంటికి వేసిన తాళాలను పరీక్షించుకోవాలని సూచించారు. మీకు ఎలాంటి అనుమానం వచ్చిన 100 నంబర్‌కు డయల్ చేయాలని స్మితా ట్వీట్ చేయడం వైరల్ అవుతుంది.
Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life.
Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency— Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023
ఆమె చేసిన ఈ ట్వీట్ రెండు రోజుల క్రితం తను అనుభవించిన ఘటనపై అనుభవం చవిచూసిందనేది ఆమె చేసిన ఈ ట్వీట్‌ద్వారా అర్థమవుతుంది. ధైర్యంగా ఉండాలని.. ఉండండి అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌అవుతుంది. ఆరోజు అర్థరాత్రి ఆమె ఎంత భయానకరమైన సంఘటన నుంచి బయట పడ్డానని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. ఎవరైనా సరే భయంకరమైన అనుభవం ఎదురైనా.. అనుమానం వచ్చిన 100కు డయల్ చేయాలని ప్రతి మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితులకు గురించి తెలుపుతూ ఆమె ఈట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది.
Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..