ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. 'తెలంగాణలో సొరంగం పైకప్పు కూలడం నన్ను ఎంతో బాధించింది.. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో ఉన్నవారిని త్వరగా తిరిగి తీసుకురావడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేస్తుంది' అని రాహుల్ గాంధీ తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
Srisailam : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది. గమనించదగిన విషయం…