నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీఐజీ, ఐజీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మరోవైపు.. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు కాసేపట్లో ప్రమాద స్థలికి చేరుకోనున్నాయి. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తెలియజేయాలని ఆదేశించారు.
Read Also: Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు
మరోవైపు.. ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ దుర్ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాసేపట్లో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటన వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోనున్నాయి. విజయవాడ నుండి 2, హైదరాబాద్ నుండి మరో టీంతో కలిసి ప్రమాద ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ చేరుకోనున్నాయి.
Read Also: APPSC vs AP Government: గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..!