Breaking News: బురదలో చిక్కుకున్న ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు..
- ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి...
- 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు..
- శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు..
- సంఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కాగా.. ఎనిమిది ప్రాణాలపై ఆశలు సల్లగిల్లుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే..
Read Also: SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి..
Also Read
- ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!
- Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు మట్టి, బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అందుకోసం.. ఎన్డీఆర్ఎఫ్‌ను కూడా పిలిపిస్తున్నట్లు మంత్రులు ఉత్తమ్, జూపల్లి తెలిపారు. అంతేకాకుండా.. భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సహాయ కూడా కోరామన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా.. మట్టి, నీరు వచ్చి చేరిందని.. అది 8 మీటర్ల మేరకు చేరిందని పేర్కొన్నారు.
Read Also: Belagavi: మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..
మరోవైపు.. టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగురు జయప్రకాష్ అసోషియేట్స్ ఉద్యోగులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గల్లంతైన రాబిన్స్ కంపెనీ ఉద్యోగులు అమెరికన్లా..? ఇండియన్ల అన్నదానిపై క్లారిటీ లేదు. కాగా.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!