Srisailam : శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం
- శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం
- ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఘటన
- మూడు మీటర్ల మేర కుంగిన పైకప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది. గమనించదగిన విషయం ఏమిటంటే, ఈ టన్నెల్‌లో నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు పనులు ప్రారంభమయ్యాయి. అయితే, ఎంతో త్వరగా ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టన్నల్ బోర్ మెషిన్‌తో డ్రిల్లింగ్ జరుగుతుండగా, లోపల పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Amaravati: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటినుంచంటే..!
Also Read
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ప్రమాదం జరిగిన క్షణాల్లో టన్నెల్ లోపల పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడంతో సమీపంలోని కార్మికులు అప్రమత్తమై లోపలికి పరుగెత్తారు. అప్పటికే పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రభుత్వం టన్నెల్ నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంజినీర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఏడాదిలోపు పనులు ముగియాలన్న లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. అయితే, ఇలాంటి తక్షణ ప్రాజెక్ట్‌లలో పనుల నాణ్యతను విస్మరించడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై వారు సమగ్ర విచారణ చేపట్టారు. పనుల్లో ఎక్కడ తప్పుదొర్లిందో అంచనా వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రమాదం తర్వాత టన్నెల్ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో భయం నెలకొంది. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించకుండా పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రమాదానికి దారితీసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు కూడా భద్రతా చర్యల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఈ ప్రమాదానికి నిజమైన కారణం ఏంటనే దానిపై త్వరలో స్పష్టత రానుంది.
Vijayawada: యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ.. 10 మంది మహిళలు అరెస్ట్
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?