ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘తెలంగాణలో సొరంగం పైకప్పు కూలడం నన్ను ఎంతో బాధించింది.. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో ఉన్నవారిని త్వరగా తిరిగి తీసుకురావడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేస్తుంది’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
Deeply distressed to learn about the tunnel roof collapse in Telangana. My thoughts are with those trapped inside and their families at this difficult time.
I have been informed that rescue operations are underway, and the state government along with disaster relief teams are…
— Rahul Gandhi (@RahulGandhi) February 22, 2025
Read Also: Dance Icon 2 : సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో
ప్రమాదంపై సీఎం సమీక్ష
మరోవైపు.. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు. మరోవైపు.. గాయపడ్డ వారి పరిస్థితిని సీఎం ఆరా తీశారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ప్రారంభం కాని రెస్క్యూ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కాలేదు. గడిచిన 14 గంటలుగా టన్నెల్‌లోనే 8 మంది ఉన్నారు. మరోవైపు.. ఎస్ఎల్బీసీ వద్దకు ఎన్డీఆర్ఏ బృందాలు చేరుకున్నాయి. టన్నెల్‌లో 13 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మట్టిలోనే 8 మంది చిక్కుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో.. 8 మంది ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.