సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ కొడితే సిక్సర్ పోవాల్సిందే. టీమిండియా యువ బ్యాట్స్మెన్ రింకూ సింగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌తో ఈరోజు జరిగిన క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 4 సిక్సర్లు కొట్టి మరే క్రికెటర్ చేయలేని పని చేశాడు. న్యూజిలాండ్‌పై 40 బంతుల్లో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
పొలార్డ్ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌ను ఓ ఆట ఆడుకున్నాడు పొలార్డ్. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్ ప్రత్యర్థులకు ఊచకోత చూపించాడు. ఇంతకు ముందు క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేయని జోర్డన్.. సిక్సర్ల సునామీ చూపించాడు. హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.
ఇంగ్లాండ్‌కి చెందిన 37 ఏళ్ల వికెట్ కీపర్- బ్యాటర్ క్రిస్ కుక్ గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మిడిల్‌సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యా్ట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. 7 సిక్సర్లు, 12 బౌండరీలతో అద్భుత సెంచరీ (113) పరుగులు చేశాడు.