మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.