మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు... ముంబైలోని స్టూడియో, క్లబ్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కునాల్‌పై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కునాల్ కమ్రాతో సహా దాడికి పాల్పడ్డ శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.