Pooja Hegde: చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి కళ వచ్చింది. ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలకు మంచి టాక్ రావటంతో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వాటిలో ఒకటైన 'సీతారామం' సినిమాను అందరూ క్లాసిక్ మూవీ అని, ఎపిక్ లవ్ స్టోరీ అని పొగిడేస్తున్నారు. ఇక ఇందులో సీతగా లీడ్ రోల్ పోషించింది మృణాల్ ఠాగూర్. పాత్రలోని డెప్త్ వల్ల అమ్మడికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు నేర్చుకుని మరీ ఆ పాత్ర పోషణ చేయటం…
దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాగూర్, రశ్మిక మందణ్ణ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘సీతారామం’. శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగింది. దీనికి ‘డార్లింగ్’ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మూవీపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ‘సీతారామం’ మూవీలో సుమంత్ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే సుమంత్ ఇంతవరకూ హీరోగా తప్పితే ఇలా కీలక పాత్రలు పోషించిందే లేదు.…
Sita Ramam Trailer: మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే ‘సీతారామం’. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి సినిమాలను తెరకెక్కించిన హనురాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. మద్రాస్ రెజిమెంటల్లో లెఫ్టినెంట్గా పనిచేసే రామ్…