టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ స్టేట్మెంట్ రికార్డు చేసింది.
పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్కు సిట్ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్ నోటీసులు తనకు రాలేదని, సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన సిట్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
SPSC పేపర్ లీకేజ్ కేసులో రీమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసామని, ముగ్గురిలో ఇద్దరు TSPSC ఉద్యోగులుని తెలిపింది.
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఇవాల సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఊహించని పరిణామం నెలకొంది. బండి సంజయ్ సిట్ కు లేఖ రాశారు. తను సిట్ ముందు హాజరుకాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
MLA Purchase Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరవి ఇచారణను జులైకి వాయిదా వేసింది.. ఇక, విచారణ సందర్భంగా దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని స్పష్టం చేశారు న్యాయమూర్తి.. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.