Arvind Krishna’s SIT Movie Trailer Out: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిట్ సినిమాకు విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకుడు. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నాడు.
సిట్ సినిమాలో నటాషా దోషి హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిట్ చిత్ర ట్రైలర్‌ని యువ హీరో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన విశ్వక్.. చాలా ఆసక్తికరంగా ఉందని చిత్ర యూనిట్‌ని అభినందించారు. చిత్ర ట్రైలర్‌ను చూస్తుంటే.. మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నుంచి ఓపెన్ అయ్యి ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది.
Also Read: Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ‘పేపర్ బాయ్’ డైరెక్టర్!
ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిన కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే.. అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అన్నది కథ. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో తమ జాబ్ గురించి నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ అందిస్తుండగా.. జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.