Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. కాగా, సాహిల్‌కు సిట్ 2023 డిసెంబరులోనే నోటీసులు ఇచ్చింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం ఆ యాప్‌కు బ్రాండ్ ప్రమోటర్‌గా మాత్రమే పని చేశానంటూ వెల్లడించారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో తెలిపారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్ యాప్ సహ-యజమానిగా చెప్పుకొచ్చారు.
Read Also: Kenya Floods : కెన్యాలో వరదల విధ్వంసం.. 70 మంది మృతి.. భారీ వర్ష సూచన
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ఇక, సాహిల్ ఖాన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలన్నీ అక్రమం.. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారాయని తెలిపింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి.. ఫేక్ సిమ్ కార్డులతో సంప్రదింపులు చేసినట్లు గుర్తించారు.. మీకు ‘ది లయన్ బుక్247’తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలిందని ధర్మాసనం చెప్పింది. అయితే, పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సాహిల్.. ‘స్టైల్’, ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఆయన పని చేస్తున్నారు. సొంతంగా ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు.
Read Also: Dulam Nageswara Rao: దూలం నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన చిన్న కోడలు..
అయితే, ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ గుర్తించింది. దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్ పత్తీ లాంటి గేమ్స్ లో బెట్టింగ్/గ్యాంబ్లింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించినట్లు ఆరోపించారు. దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో గత ఏడాది నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!