Karumuri Nageswara Rao: గత ప్రభుత్వ అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. అయితే, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరవు.. ఇక, చంద్రబాబు అవినీతి మొత్తం బట్టబయలు అవుతుందన్నారు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు.. చంద్రబాబు జీవితమే అవినీతిమయం.. దేనిపైనైనా స్టే తెచ్చుకోవడమే చంద్రబాబు జీవితం అని సెటైర్లు వేశారు.
1996లో 350కోట్ల స్కామ్ జరిగితే అప్పట్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని మండిపడ్డారు కారుమూరి.. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటియంలా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సైతం చెప్పారన్న ఆయన.. చంద్రబాబుకు రెండెకరాల నుంచి లక్షలకోట్ల ఆస్తులు ఎలావచ్చాయనే దానిపై విచారణ జరగాలన్నారు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు ఎంత అవినీతిపరుడో బట్టబయలవుతుందని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటుపడిచిన చంద్రబాబు ఎన్నికలు రాగానే ఆయన్ని పొగుడుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక, అమరావతిలో తాత్కాలిక కట్టడాలపేరుతో 11 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసారు.. చిన్నపాటి వర్షాలకే అక్కడ భవనాలు కారిపోతుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
కాగా, గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు తప్పుగా అన్వయించుకుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపి ఈ రోజు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు… ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును, తీరును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. ఇక, ఏపీ హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం విదితమే.