తెలుగు సిని వినీలాకాశంలో వెలిగిన దృవతార సిరివెన్నెల శాస్త్రి. ఒక సభలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు… దర్శకుల ఆలోచనా విధానం, నిర్మాతల లెక్కలు, ప్రేక్షకుల అవగాహనారాహిత్యం లాంటి విషయాల మధ్యలో కూడా ఒక గొప్ప సాహిత్యం ఉన్న పాటని చెప్పాలనే తాపత్రయం సిరివెన్నెల సీతారామశాస్త్రిని మనకి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప పాటలని రాసిన సీతారామశాస్త్రి సినిమాల్లో ఉండడం మన అదృష్టం కానీ ఆయన సినిమాలకి మాత్రమే పరిమితం అవ్వడం మన దురదృష్టం. సినిమా తాలూకు…
ముప్పై సంవత్సరాల వయసులో చేంబోలు సీతారామశాస్త్రి… ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అయ్యారు. ఆ తర్వాత ముప్పై వసంతాలకు ‘పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. గత యేడాది నవంబర్ 30న కన్నుమూసే వరకూ ఆయన పాటతోనే ప్రయాణించారు. పాటనే పలవరించారు. తెలుగు సినిమా పాటకు సాహితీ గౌరవాన్ని కలిగించిన సీతారామశాస్త్రి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో అభిమానం. మే 20 ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టిన రోజు. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక…