తెలుగు సిని వినీలాకాశంలో వెలిగిన దృవతార సిరివెన్నెల శాస్త్రి. ఒక సభలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు… దర్శకుల ఆలోచనా విధానం, నిర్మాతల లెక్కలు, ప్రేక్షకుల అవగాహనారాహిత్యం లాంటి విషయాల మధ్యలో కూడా ఒక గొప్ప సాహిత్యం ఉన్న పాటని చెప్పాలనే తాపత్రయం సిరివెన్నెల సీతారామశాస్త్రిని మనకి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప పాటలని రాసిన సీతారామశాస్త్రి సినిమాల్లో ఉండడం మన అదృష్టం కానీ ఆయన సినిమాలకి మాత్రమే పరిమితం అవ్వడం మన దురదృష్టం. సినిమా తాలూకు…
లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. 66 ఏళ్ల గీత రచయిత ఆకస్మిక మరణ వార్త తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల 1984లో జననీ జన్మభూమితో అరంగేట్రం చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున..’ పాటతో కీర్తిని పొందారు. శాస్త్రి దాదాపు 3000 పాటలకు సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన మృతికి రాష్ట్రపతి రామ్…
సిరివెన్నెల పేరులో సీతారాముడున్నా, ఆయన మనసులో మాత్రం కైలాసవాసుడే కొలువై ఉన్నాడని చెప్పకతప్పదు. నుదుట త్రిపుండ్రాలు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ కవిత్వం పలికించేవారు సీతారామశాస్త్రి. సందర్భం ఏదైనా సరే, అలవోకగా పదబంధాలు పేర్చేవారు. తన కెరీర్ లో శివునిపై పలు పాటలు పలికించి పులకింప చేశారు సీతారామశాస్త్రి. ‘సిరివెన్నెల’లోనే “ఆది భిక్షువు వాడినేది కోరేది… బూడిదిచ్చేవాడినేది అడిగేది…” అంటూ నిందాస్తుతితో శివునిపై ఆయన పలికించిన గీతం ఈ నాటికీ భక్తకోటిని పులకింప చేస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి…