కళలకు కాదేదీ అనర్హం.. అన్న నానుడిని నిజం చేస్తూ పనిలోనే కళాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఓ చేనేత కళాకారుడు.చేనేత వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుని అందులోనే అద్భుతాలను సృష్టిస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీర, శాలువాలను తయారుచేయడంతో పాటు తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో చిత్రాలను తన మగ్గంపై నేశాడు. తాజాగా చేనేత మగ్గంపై అగ్గి పెట్టెలో ఇమిడే చీర వన్ గ్రామ్ గోల్డ్ జరీతో నేశారు. దీంతో పాటు దబ్బనంలో నుండి దూరే…