తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు 3749 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Telangana Elections Results: ఆధిక్యంలో రేవంత్ రెడ్డి..
అటు.. కరీంనగర్‌లో నాల్గో రౌండ్‌లో బండి సంజయ్‌కి 243 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. 4వ రౌండ్ పూర్తయ్యే సరికి 2232 ఓట్ల అధిక్యలో గంగుల కమలాకర్ ఉన్నారు. రామగుండంలో 7వ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి రాజ్ ఠాకూర్ 24,376 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అశ్వారావుపేటలో 9వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి జారే ఆదినారాయణకు 18530 ఆధిక్యం, పినపాకలో నాల్గో రౌండ్ కి 9574 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, పటాన్ చెరులో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 264 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మరోవైపు.. సంగారెడ్డిలో రెండో రౌండ్‌లో వెనుకంజలో జగ్గారెడ్డి ఉన్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 8208 లీడ్, వేములవాడలో ఆరో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్‌కి 2776 ఓట్లు ఆధిక్యంలో ఉంది.
అటు, జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండో రౌండ్ ముగిసేసరికి అధికార బీఆర్ఎస్ 120 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు 7,374 ఓట్లు… బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ (ఎంపీ)కు 6,168 ఓట్లు… కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ్ రావుకు 3,990 ఓట్లు లభించాయి.