సిరిమాను సంబరానికి అంతా సిద్ధమయింది, ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విజయనగరం జిల్లా ముస్తాబైంది. కరోనా కారణంగా పైడిమాంబ ఉత్సవాలను గతంలోలా కాకుండా చాలా సాదాసీదాగా జరపనున్నారు. రెండో ఏడాదీ భక్తులు లేకుండానే అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని కనులారా వీక్షించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు. ఇదిలా వుంటే.. సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధం అయింది. కోట బురుజుపై చేరుకున్నారు రాజవంశీయులు అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు.…