సింగరేణిలో ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి జరగనున్న ఎన్నికల్లో 13 పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీల పోటీ కొనసాగుతుంది.
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు వీలు కల్పించింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఇంతకుముందు.. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ పిటిషన్‌ను ఈరోజు విచారించగా.. ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది.