సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంను టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సింహాద్రి అప్పన్నను కింగ్ దర్శించుకున్నారు. దర్శనానంతరం కోహ్లీకి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అప్పన్న స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు కోహ్లీకి స్వాగతం పలికారు. Also Read: Alluri Agency Shock: అల్లూరి ఏజెన్సీలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి! విరాట్…
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలిన స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈఓ సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇవ్వలేకపోయారు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు విచారణ కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. నోట్ ఫైల్, ఎమ్ బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఫాలో అయ్యారా? అనే ప్రశ్నలకు అధికారులు…
విశాఖ జిల్లా సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సింహాచలం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు.. ఆరు రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి రెండు రోజుల కిందట పూర్తి చేశారు.. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ? చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు..
విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువున బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భక్తులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇక సంఘటనాస్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
విశాఖకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. దీంతో సింహాచలం ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి భక్తులు క్యూకట్టారు. వర్ష సూచన నేపథ్యంలో భక్తులకు వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు.
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు.
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.