సింహాచలం, మాన్సస్ అక్రమాల అంతు తేలుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. భగవంతుడి సొమ్ము తిన్న వాళ్లకు అరెస్టులు తప్పవని హింట్ ఇస్తోంది. ఈ హెచ్చరికల వెనక ప్రభుత్వ పెద్దలకు పకడ్బందీ వ్యూహమే ఉందా? విచారణ కోసం సీఐడీ రంగంలోకి దిగనుందా? తాజా పరిణామాలు దేనికి సంకేతం? నాటి ఈవో రామచంద్రమోహన్ సమయంలోనే రికార్డుల్లో మార్పు? విజయనగర సంస్థానం వారసత్వ వివాదం తర్వాత మాన్సస్ ట్రస్ట్.. సింహాచలం దేవస్థానం భూముల తేనెతుట్ట కదిలింది. 2016 సమయంలో సుమారు 800 ఎకరాల…
సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్ ఫిక్స్ అయిందా? అశోక్ గజపతిరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? త్వరలో కీలక పరిణామాలు ఉంటాయా? సూత్రధారులు.. పాత్రధారుల చిట్టా బయటపడుతోందా? అసలేం జరుగుతోంది? 700 ఎకరాలను ఆలయ రికార్డుల నుంచి తప్పించారా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే రంగంలోకి దిగింది సర్కార్.…
సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ లో గోల్ మాల్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. 748ఎకరాల భూముల వివరాలను తొలగించినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2016లో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… రామచంద్ర మోహన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో రికార్డులు మారినట్టు భావిస్తుంది. ఈఓ కు అధికారం లేకపోయినా రికార్డుల్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.…
సింహాచలం భూముల్లో జరిగిన అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సింహాచలం దేవస్థానానికి గతంలో ఈవోగా పని చేసిన రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవదాయ శాఖ కమిషనర్.. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్‌పై అభియోగాలున్నాయి… ప్రస్తుతం దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్-2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్రమోహన్.. సర్కార్‌కు సరెండర్ చేశారు.. అయితే, ఈ వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరిగేందుకే రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు చెబుతున్నారు.…
సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ తర్వాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్టక ముందునుంచే ఉందన్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్న ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి…