టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్ అని ఆరోపించారు. అచ్చెన్నమాటలు రైతులు మధ్య కొట్లాటలు జరిగేలా ఉన్నాయని దుయ్యబట్టారు. టెక్కలి - పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా మాటలు ఉన్నాయని మంత్రి సీదిరి అన్నారు. టీడీపీ హాయాంలో ఎత్తిపోతల పథకాలు ఇష్టానుసారంగా నిర్మించారని.. గతంలో లిఫ్ట్ లు ఆన్ చేస్తే.. పలాస చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని తెలిపారు.
విశాఖలో చోటు చేసుకున్న మత్స్యకారులు వాగ్వాదానికి సంబంధించి మంత్రుల సమావేశం ముగిసింది. ఈసందర్భంగా ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. అనుమతి ఉన్న 11 రింగు వలల బోట్లలో మూడింటికే ట్రాన్స్ ఫా౦డర్స్ ఉన్నాయి. వాటితో 8కిలోమీటర్ల తరువాత వేట కొనసాగించవచ్చని తెలిపారు. మిగిలిన 8 రింగు వలల బోట్లు ట్రాన్స్‌ఫాండర్స్ ఏర్పాటు చేసుకుని వెళ్లొచ్చిని తెలిపారు. రింగు వలల వివాదం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉందని, మత్స్యకారులు సామరస్యంతో ఉండాలని మంత్రి…
మత్య్సకార సోదరుల మధ్య గొడవ దురదృష్టకరమైన సంఘటన అని ఏపీ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సముద్రంలోకి లోపలికి వెళ్లి ఎవ్వరి బోట్లు వారే కాల్చుకుంటామంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా అందరిని కంట్రోల్‌లోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. Read Also: ఉద్యమాన్ని అణిచివేయడానికే…
జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మేమేదో పాపం చేసినట్టు, అమూల్‌కి సంపద దోచిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. అమూల్ అనేది ప్రైవేట్ సంస్థ కాదు.. సహకార సంస్థ రాష్ట్రంలో ఉన్న సహకార సంస్థలు అన్నింటిని చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. పాడి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాంసంగం డెయిరీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని మంత్రి పేర్కొన్నారు. Read Also: ఆ…
కృష్ణాజిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..బుధవారం సీఎం జగన్ చేతుల మీదుగా పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఇది విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా జగనన్న పాలవెల్లువ ప్రారంభిచడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. నూజివీడు డివిజన్ పరిధిలో 9 మండలాలను గుర్తించామన్నారు.…
గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య బాధకలిగించింది అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అయితే గుంటూరు ఘటన పై సీఎం జగన్ తక్షణమే స్పందించారు అని తెలిపారు. ఇక గుంటూరులో లోకేష్ పర్యటించడాన్ని మేం తప్పు పట్టడం లేదు. కానీ లోకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. చెత్తనాకొడుకులు , వెధవలు అని మాట్లాడుతున్నాడు. మాకు బూతులు రావా …మేం మాట్లాడలేమనుకుంటున్నారా అని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారి వ్యవహరించడం సరికాదు. సానుభూతి పేరుతో రాజకీయ…
వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన రాబోయే తరాలకు ఓ దిక్సూచి అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పార్టీలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోంది అని తెలిపిన ఆయన రెండేళ్లలో లక్షా 31వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేశాం అని పేర్కొన్నారు. రూపాయి లంచం లేకుండా జగన్ ఒక్క బటన్ నొక్కితే లబ్ధిదారులకు సంక్షేమం అందుతోంది. కోట్లాది మంది కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తి సీఎం జగన్. మొన్నటి ఎన్నికల…
చంద్రబాబు , టీడీపీ నేతల పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు , లోకేష్ & బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు తెలుగు ప్రజలను రానివ్వడం లేదు. దీనికి ఎల్లో వైరస్ కారణం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు లాగా నీచరాజకీయాలు మరెవరూ చేయలేరు. అసలు…