3 Terrorists Killed In Gunfight With Security Forces In Jammu: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నిన్న జమ్మూ సమీపంలోని ఉధంపూర్ లో 15 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసిన ఘటన మరవక ముందే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జమ్మూాలోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులుకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు.