Basavaraj Bommai: భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ‘రీలాంచ్’ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basavaraj Bommai: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కోసమే తప్ప, ఇది సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం అన్నారు. భారతదేశంలో పార్టీ అస్తిత్వం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఉన్న భారత్ జోడో యాత్ర (మంగళవారం 34వ రోజుకు చేరుకుంది)కు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. రాయచూర్ తాలూకాలోని గిలేసుగూర్ గ్రామంలో సీఎం బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభించిన అనంతరం బొమ్మై మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యతో తలపడి తాను పార్టీలో చేరిన రోజే ‘సమాజ్‌వాద్’ను వీడినట్లు చెప్పారు. ‘సమాజ్‌వాదీ నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరిన రోజున ‘సమాజ్‌వాద్’ను వదిలిపెట్టారు. సిద్ధరామయ్య ఓ చిన్న పిల్లవాడి కింద పనిచేస్తూ ఆయన సూచనలను పాటించడం బాధాకరం. ఇది ఆత్మగౌరవానికి చిహ్నం కాదు.’ అని బొమ్మై అన్నారు.
“కాంగ్రెస్ నేతలు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగానే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని, ఈ ఘటన రాహుల్ గాంధీ ‘రీలాంచ్’ తప్ప మరొకటి కాదని బసవరాజ్ బొమ్మై అన్నారు. సామాన్యులు, దళితుల కోసం కాదంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ను ‘మునిగిపోతున్న ఓడ’గా అభివర్ణించిన బొమ్మై, ఆ వైపు (కాంగ్రెస్) ఉన్నవారు ఇటువైపు (బీజేపీ) వస్తున్నారని, అందుకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, వెనుకబడిన తరగతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని ఆరోపించిన ముఖ్యమంత్రి.. ఆ పార్టీకి వారిని ఉద్ధరించాలనే ఇంగితజ్ఞానం లేదన్నారు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు 15 నుంచి 17 శాతానికి, షెడ్యూల్డ్ తెగలకు 3 శాతం నుంచి 7 శాతానికి రిజర్వేషన్లు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ శనివారం ఏకగ్రీవంగా అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. విద్య, ఉపాధిపై అవగాహన వల్ల ప్రజల ఆకాంక్ష పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!