స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్‌ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్‌ఫామ్‌గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది.
Komaram Bheem: కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం కారణమని, బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.…
తమిళనాడు రాష్ట్రంలో ఒక గుడికి సీల్ వేశారు, మరో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కారణం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఆలయంలోకి రాకుండా కొందరు వ్యక్తులు ప్రవేశం నిరాకరించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సీల్ వేసిన గుడి తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయం కాగా.. వీరనంపట్టిలోని కాళియమ్మన్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
బెల్జియం వివాదాస్పద అణు రియాక్టర్‌ను మూసివేయనుంది. బెల్జియం అణు శక్తి నుంచి మొత్తం నిష్క్రమణను ఆలస్యం చేసినప్పటికీ, పొరుగున ఉన్న జర్మనీతో వివాదానికి కారణమైన వృద్ధాప్య అణు రియాక్టర్‌ను మూసివేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ ర్యాంకింగ్ సర్వీస్ అలెక్సా.కామ్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెల నుంచి దీనిని అమలు చేయనున్నట్లు తెలిపింది. అలెక్సా.కామ్ ద్వారా వెబ్‌సైట్‌ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకులను అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌ఈవో రీసెర్చ్, అనాలిసిస్ టూల్స్ కూడా అందిస్తోంది. పెయిడ్ వెర్షన్ తీసుకుంటే పలు రకాల ఎస్‌ఈవో సర్వీసులను కూడా వినియోగదారులు పొందవచ్చు. Read Also: బాలినో భళా… మూడేళ్ల కాలంలో……