ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ ర్యాంకింగ్ సర్వీస్ అలెక్సా.కామ్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెల నుంచి దీనిని అమలు చేయనున్నట్లు తెలిపింది. అలెక్సా.కామ్ ద్వారా వెబ్‌సైట్‌ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకులను అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌ఈవో రీసెర్చ్, అనాలిసిస్ టూల్స్ కూడా అందిస్తోంది. పెయిడ్ వెర్షన్ తీసుకుంటే పలు రకాల ఎస్‌ఈవో సర్వీసులను కూడా వినియోగదారులు పొందవచ్చు.
Read Also: బాలినో భళా… మూడేళ్ల కాలంలో…
అయితే సర్వీస్‌ను షట్‌డౌన్ చేసేలోగా ఆయా వెబ్‌సైట్లు తమ డేటాను పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పించింది. అందుకే డిసెంబర్ 8, 2021 నుంచి కొత్త సబ్‌స్క్రైబర్లను అలెక్సా చేర్చుకోవడం లేదు. కాగా అలెక్సా.కామ్ సర్వీస్‌ను అమెజాన్ 1996 ఏప్రిల్ నెలలో లాంచ్ చేసింది. అంటే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మే 2022లో ఈ సర్వీస్‌ను అమెజాన్ షట్‌డౌన్ చేయనుంది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక వెబ్‌సైట్ ర్యాంకును అంచనా వేయడానికి అలెక్సా ర్యాంకును పరిగణనలోకి తీసుకోవడం ఇకపై కుదరదు. ప్రస్తుతం పలు యాడ్ల కంపెనీలు తమ ప్రకటనలను వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి అలెక్సా ర్యాంకునే పరిగణనలోకి తీసుకుంటున్నాయి.