గోవాలో హస్తం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు హస్తానికి గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరనున్నట్లు గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు.