Budda Rajasekhar Reddy: రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం…
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్య ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలిలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించాలి.. అధికారం పోయిన తర్వాత, చేసిన వాటిని అనుభవించాల్సి వస్తుంది.. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుక మందమంటూ చంద్రబాబు గర్వంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లాస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. బాబుకు మోసం తప్ప చిత్తశుద్ధి తెలియదని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
TDP vs YCP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపై తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విసిరిన సవాల్ కు మాజీ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు.
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీదికి మరో అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైసీపీలో ఉన్న శిల్పా.. జనసేనలో చేరేందుకు లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని, ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది
ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు ఇంకా ఘాటుగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా భూ యుద్ధం మొదలైంది. ఇద్దరిదీ ఒకే పార్టీ కాదు, ఒకే సెగ్మెంట్ కాదు… అయినా, యవ్వారం యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నాయకులు? ఆళ్ళగడ్డ…. ఆ పేరులోనే ఫైర్ ఉంటుంది. ఏదో ఒకరకమైన వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటుంది నంద్యాల జిల్లాలోని ఈ…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే…
కేబినెట్‌లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి ఎక్కడ తేడా కొట్టింది? ఆయనకు ప్రతికూలంగా మారిన పరిణామాలేంటి? శిల్పా అనుచరుల్లో ఏ అంశంపై చర్చ జరుగుతోంది? పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్న వాదనేంటి? మంత్రి పదవి రాకుండా ఎక్కడ తేడా కొట్టింది? నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ప్రచారం జరిగింది. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం.. అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఆరేళ్ల ఎమ్మెల్సీ…