Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా…
Bangladesh: పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ పయణిస్తోంది. ఆ దేశ జాతీయ సెలువు దినాలను ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 7, ఆగస్టు 15 వేడుకలతో సహా 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 స్వాతంత్ర్య సంగ్రామం స్పూర్తిపై దాడిగా ఈ నిర్ణయాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.
బంగ్లాదేశ్ జనం ఎంతో గౌరవించే వారి మహానాయకుడు ముజీబుర్ రహ్మాన్. ఆయన జీవిత చరిత్ర శ్యామ్ బెనగల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇండియా, బంగ్లాదేశ్ లలో కరోనా లాక్ డౌన్స్, అలాగే, ఈ మధ్య వచ్చిన రెండు భారీ తూఫాన్లు సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశాయి. కాకపోతే, ఎలాగోలా ఇప్పటికే 80 శాతం బయోపిక్ పూర్తి చేశామన్న శ్యామ్ బెనగల్ మిగతా భాగం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాడిన…