Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ అధికారంలోకి రావడంతో అక్కడి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. భారత్ టార్గెట్‌గా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, బంగ్లాదేశ్ జమాతే ఇస్తామీ డిప్యూటీ లీడర్ అమీర్ సయ్యద్ అబ్దుల్లా మహ్మద్ తాహెర్ ‘‘ఘజ్వా-ఎ-హింద్’’ గురించి మాట్లాడుతూ,
Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. అయితే, ఆయన నియామకం తర్వాత మైనారిటీలు , ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు.
Bangladesh: గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని వదలాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా దేశాన్ని వదిలిన ఆగస్టు 5న ‘‘విప్లవ వార్షికోత్సవం’’గా జరుపుకోబోతోంది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ రోజే,…
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.