కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. భారత్‌ను అవమానించేందుకే రాహుల్‌గాంధీ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు.
BJP: ‘‘ ఓట్ చోరీ’’పై భారీ ర్యాలీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే, ర్యాలీ వేదిక వద్ద ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి పలువురు కార్యకర్తలు విద్వేష వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీని ‘‘అంతం చేయడమే’’ కాంగ్రెస్ అసలు లక్ష్యంగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ వేదిక వద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేసిన తర్వాత, బీజేపీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. “మోదీ, తేరీ…
Jihad Remark: ఇటీవల జమాత్ చీఫ్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ ‘‘జిహాద్’’ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ మొహిబ్బుల్లా నద్వీ కూడా చేరారు. సాక్షాత్తు పార్లమెంట్ వేదికగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Musharraf wanted to see Rahul Gandhi as PM: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. గతంలో పర్వేజ్ ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ హస్తం పార్టీపై విరుచుకుపడుతోంది. ఆదివారం తన సంతాప సందేశంలో ముషారఫ్ ను ప్రశంసించాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా…