పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేశారు.
Pakistan election: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు.…
Pakistan : పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రారంభ పోకడలు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని PML-N... ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టి పోటీని చూపుతున్నాయి.
ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
పదవీకాలం ముగియక ముందే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు అదనపు సమయం పొందేందుకు ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు ఆగస్టు 8న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాన పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి సుమోటో నోటీసు తీసుకునే విచక్షణ అధికారాలను పరిమితం చేసే లక్ష్యంతో పాకిస్తాన్ న్యాయ మంత్రి అజం నజీర్ తరార్ మంగళవారం సుప్రీంకోర్టు (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు.